అధికారుల నిర్లక్ష్యం.. ఏల సుందర్ సేవా దృక్పథం!
- అధికారుల నిర్లక్ష్యం.. ఏల సుందర్ సేవా దృక్పథం! - October 5, 2026
- బ్రిడ్జిపై గుంత.. అధికారుల నిర్లక్ష్యం! - October 4, 2026
- గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు - October 2, 2026

దేవరుప్పుల మండల కేంద్రంలోని హైలెవల్ వంతెనపై ప్రమాదకరంగా మారిన గుంతకు సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి జేసీబీతో పగిలిన కాంక్రీట్‌ను తొలగించి, గుంతను చదును చేయించారు. అనంతరం కాంక్రీట్ పోయించి మరమ్మతులు చేయించారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తొలగాయి. ప్రజా సమస్య పరిష్కారానికి ముందుకొచ్చిన ఏల సుందర్‌కు గ్రామస్తులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
