జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

5b19928e-6aa1-4d71-aa47-f04a9896c5a6.jpeg

దేవరుప్పుల: జనగామ జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ వద్ద మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్‌ పాలనలో జనగామ జిల్లా అభివృద్ధి చెందిందని, వైద్య కళాశాల, ఆసుపత్రులు, ఆలయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. దేవాదుల నీటితో జిల్లా సస్యశ్యామలమైందన్నారు. ఆదివారం జరిగే వేడుకలకు మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

You may also like...