తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: ఎర్రబెల్లి

fbd34c9c-fd0c-470b-a8a5-7e54734c2902.jpeg

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, కోలాటంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. కేసీఆర్ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీలో జాప్యం చేస్తోందని విమర్శించారు. వేడుకల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, గ్రామ మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

You may also like...