Author: Venkateshwarlu Vardhamanu

నల్లా నర్సింహులు పోరాటం స్ఫూర్తిదాయకం: ఎర్రబెల్లి

పాలకుర్తి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శతజయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని నల్లా నర్సింహులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సేవలు, త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. యువతకు ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శంగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్…

నల్ల నరసింహులు సేవలు చిరస్మరణీయం

నల్ల నరసింహులు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహానికి సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్, నల్ల అరుణతో కలిసి నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నల్ల నరసింహులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యత అని ఏల సుందర్ అన్నారు. కార్యక్రమంలో జోగు సుదర్శన్, జోగు సుధాకర్, జోగు మధుసూదన్ పాల్గొన్నారు.

భారీ వర్షానికి కూలిపోయిన ఇంటి గోడలు

దేవరుప్పుల మండలంలో కురిసిన భారీ వర్షాలకు ఓ పేద కుటుంబానికి చెందిన ఇల్లు కూలిపోయింది. దేవరుప్పుల మండలానికి చెందిన చింతమల్లయ్య ఇంటి గోడలు వర్షపు నీటికి తడిసి బలహీనమై ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో ఇంట్లోని సామగ్రి దెబ్బతిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇల్లు కోల్పోయిన చింతమల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని, తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.

సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, శారీరక అభివృద్ధి సాధ్యమని సూపర్వైజర్ శ్రీదేవి అన్నారు. పెద్దమడూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. రోజువారీ ఆహారంలో బియ్యం, గోధుమలు, పప్పులు, గుడ్లు, పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, విటమిన్లు, మినరల్స్‌ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నెయ్యి, నూనె వంటి కొవ్వు పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది, హెల్పర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

పాలకుర్తిలో ఘనంగా మట్టి గణపతి నిమజ్జనం

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పర్యావరణహితంగా ప్రతిష్ఠించిన మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పు వాయిద్యాలు, భజనలు, గణపతి నామస్మరణల మధ్య శోభాయాత్రగా నిమజ్జనం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని “గణపతి బప్పా మోరియా” నినాదాలతో సందడి చేశారు. మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలని ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

గుడిచెరువు నిమజ్జన స్థలంలో పోలీసుల భద్రతా ఏర్పాట్ల పరిశీలన

దేవరుప్పుల మండలంలోని గుడిచెరువు నిమజ్జన స్థలాన్ని డీసీపీ (వెస్ట్)తో పాటు వర్ధన్నపేట ఏసీపీ, పాలకుర్తి సీఐ బుధవారం పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జన ప్రదేశంలో బారికేడింగ్, లైటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పెద్దమడూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గనుపాక శ్రీనివాస్, పానుగంటి సాయిలు, గోడిశాల సుశీల, గనుపాక ఐలమ్మ కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న శ్యామల సుధాకర్ రెడ్డి, దుబ్బ రాజశేఖర్, రేగుల స్వామిదాస్, రుద్రోజు యాదగిరి, నాగిళ్ల జాశివలను పరామర్శించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో…

వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దుర్మార్గం

మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దుర్మార్గమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ విధానంగా మారిందని విమర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగించాలని…

మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి గూడెం పెద్ద వేపచెట్టు వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని రేషన్ డీలర్ దుద్దుల పరుశరాములు–పద్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు యువసేన యూత్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానానికి సహకరించిన దుద్దుల పరుశరాములు–పద్మ దంపతులను కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించడం ఆనందంగా…

భక్తులకు అన్నదానం

దేవరుప్పులలో వినాయక చవితి సందర్భంగా శ్రీ బాలాజీ జువెల్లర్స్ బావుసింగ్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక మండపం వద్ద భక్తులకు అన్నప్రసాదం అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, మనోహర్ సింగ్, గొడిశాల మల్లేష్, కారుపోతుల సందీప్, అయ్యప్ప అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.