సద్దుల బతుకమ్మ వేళ విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

b9199ace-458f-459d-a217-54aa49dccaae.jpeg

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి చిత్తలూరి మధు (అంజయ్య కుమారుడు) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మృతదేహాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

You may also like...