వెల్దండ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ.. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం
- వైమానిక దళ ఉద్యోగాలపై డిసెంబర్ 5న అవగాహన కార్యక్రమం - November 27, 2026
- .20 వేలకు రూ.లక్ష ఆశ.. భారీ మోసంపై బాధితుల ఆందోళన! - November 27, 2026
- పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు – కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ - November 27, 2026

జ్ఞాన తెలంగాణ,వెల్దండ ప్రతినిధి వంబర్ 27:వెల్దండ పోలీస్ స్టేషన్‌ను గద్వాల్ జోన్ ఇన్‌చార్జి డీఐజీ చందన దీప్తి,జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, డీఎస్పీ శ్రీనివాసులు వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అధికారులకు సిబ్బంది గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించారు.అనంతరం పోలీస్ స్టేషన్‌లోని కేసుల నమోదు వివరాలు, వివిధ రికార్డులు, నిర్వహణ పద్ధతులను అధికారులు పరిశీలించారు. సిబ్బంది పనితీరును సమీక్షించి, విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను ఓపికగా విని, చట్టపరిధిలో తక్షణమే స్పందించాలని ఆదేశించారు. కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఇన్‌స్పెక్టర్, వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై యుగంధర్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
