తండాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించిన ఘనత కేసీఆర్‌దే: అంజి మాస్టర్

1001404207.jpg

వెల్దండ,నవంబర్ 27: తెలంగాణలో గిరిజన తండాల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని బీఆర్ఎస్ వెల్దండ మండల నాయకుడు అంజి మాస్టర్ పేర్కొన్నారు.2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ద్వారా 500కు పైగా జనాభా ఉన్న అనేక గిరిజన తండాలు, గూడేలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారని తెలిపారు. దీంతో తండాలకు సొంత సర్పంచులు, వార్డు సభ్యులు ఏర్పడి స్థానిక పాలనలో గిరిజనులకు భాగస్వామ్యం లభించిందన్నారు.గతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న తండాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా గిరిజనుల స్వయంపాలనకు గ్రామపంచాయతీల ఏర్పాటు దోహదపడిందని ఒక ప్రకటనలో వెల్లడించారు.

You may also like...