చంద్రాయన్పల్లి వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.4 లక్షల విరాళం
- ఆడబిడ్డ వివాహానికి సర్పంచ్ రూ.10 వేల ఆర్థిక సహాయం - November 25, 2026
- చంద్రాయన్పల్లి వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.4 లక్షల విరాళం - November 25, 2026
- అడవి పంది దాడిలో గాయపడిన గీత కార్మికుడికి పరామర్శ - November 25, 2026
కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

చారకొండ,నవంబర్ 24: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చారకొండ మండలం చంద్రాయన్పల్లి గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి కార్తీక దీపోత్సవంలో పాల్గొని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.ఆలయ అభివృద్ధిలో భాగంగా తన సొంత ఖర్చులతో రూ.4 లక్షలు వెచ్చించి ఆలయానికి రంగులు వేయించి నూతన శోభ తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పర్వదినం మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామాల్లో దేవాలయాలు ప్రజల ఐక్యతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.అనంతరం గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి రూ.4 లక్షల సహకారం అందించి, ఆలయానికి నూతన శోభ తీసుకువచ్చిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలికేశ్వరం శంకర్, ఉపసర్పంచ్ డేరంగుల వెంకటయ్య, చైర్మన్ సీతారామ్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, సాంబయ్య గౌడ్, నారాయణ, పర్వతాలు, జంగయ్య, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
