సీఎం సభకు భారీగా తరలిన వెల్దండ కాంగ్రెస్ శ్రేణులు
- పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం స్పష్టత ఇవ్వాలి.. యువ నేత చీమల అర్జున్ రెడ్డి - November 27, 2026
- రాజ్యాంగ విలువలను కాపాడాలి – సర్పంచ్ జంతుక వెంకటయ్య - November 27, 2026
- పరిష్కారం కోసం ఎదురుచూపులు.. పోలీసుల అరెస్టుల మధ్య కొనసాగుతున్న నిరసన - November 27, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,నవంబర్ 26: అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభకు వెల్దండ మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు బస్సులు, ఇతర వాహనాల్లో సభకు బయలుదేరారు.ఈ సందర్భంగా సభకు బయలుదేరిన బస్సులను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వెల్దండ మండల పార్టీ అధ్యక్షులు హరి కిషన్ నాయక్,వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు సత్తూరి ప్రసాద్ గౌడ్, సంగీత శేఖర్ రెడ్డి, జక్కుల శిరీష,వెంకటేష్ యాదవ్, దస్లీ రామదాసు నాయక్, రోజా అరుణ్ కుమార్ నాయక్, గన్యా నాయక్, రమేష్ నాయక్, గున్నేళ్ల శ్రీనివాసులు, ముక్తాల రమేష్, భాగ్యమ్మ, రవీందర్ నాయక్, శ్రీను నాయక్, నాయకులు పుల్లయ్య, శ్రీనివాసులు, భరత్ గౌడ్ తదితరులతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
