పరిష్కారం కోసం ఎదురుచూపులు.. పోలీసుల అరెస్టుల మధ్య కొనసాగుతున్న నిరసన
- పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం స్పష్టత ఇవ్వాలి.. యువ నేత చీమల అర్జున్ రెడ్డి - November 27, 2026
- రాజ్యాంగ విలువలను కాపాడాలి – సర్పంచ్ జంతుక వెంకటయ్య - November 27, 2026
- పరిష్కారం కోసం ఎదురుచూపులు.. పోలీసుల అరెస్టుల మధ్య కొనసాగుతున్న నిరసన - November 27, 2026

చారకొండ నవంబర్ 26: తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ ఎర్రవల్లి భూ నిర్వాసితులు చేపట్టిన నిరసన దీక్షలు 360వ రోజుకు చేరుకున్నాయి.ఇంతకాలంగా శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం, నిరసన కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం, నిరసనలను అడ్డుకోవడం బాధాకరమని అన్నారు.పోలీసుల అరెస్టులు, ఆంక్షలతో తమ సమస్య పరిష్కారం కాదని, తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై ఆంక్షలు విధించడం కంటే తమ భూ సమస్యను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
