అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం : విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం : విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం - November 17, 2026
- సొంత పార్టీ సర్పంచ్‌కే గుర్తింపు కరువా? - November 17, 2026
- వైభవంగా మండల మహా కలశ స్థాపన - November 16, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 17 : అర్హులైన పేదలకు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గౌడ, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిండమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం అన్నారు. మండలానికి మంజూరైన 1141 నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత పింఛన్లు కేవలం ఆర్థికసాయం మాత్రమే కాదని, నిరుపేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేందుకు అండగా నిలిచే భరోసా అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్బీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్ డీఏ పీడీ శేఖర్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులా మాధవరెడ్డి, ఎంపీడీఓ గంట అంజన్ రెడ్డి, తాసీల్దార్ పుష్పలత, మాద జడ్పీటీసీ మాద యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి నంద్యాల వెంకట్ రెడ్డి, సర్పంచ్ లు ఫోరం మండల అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి, నాయకులు పెద్ది యాదగిరి, పెద్ది సుక్కయ్య, గద్దపాటి దానయ్య, మిట్టపల్లి శివ, బెజవాడ సైదులు, అయితగోని నారాయణ, సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
