వైభవంగా తులసి దామోదర కళ్యాణం వార్షిక ఏకాదశి పూర్ణాహుతి
- వైభవంగా తులసి దామోదర కళ్యాణం వార్షిక ఏకాదశి పూర్ణాహుతి - November 21, 2026
- ఎమ్మెల్యే వీరేశంపై విమర్శలు సహించేది లేదు : కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య - November 21, 2026
- వలసలు నివారించడమే లక్ష్యం : ఏపీఓ కడెం రామ్మోహన్ - November 20, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూరు నవంబర్ 21 : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో తులసి కళ్యాణం, కార్తీక దామోదర పూజా, వార్షిక ఏకాదశి మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్న తృతీయ వార్షిక ఏకాదశి హోమం పూర్ణాహుతి ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ, రామడుగు అశ్విన్ శర్మ ఆధ్వర్యంలో తులసి కళ్యాణం, కార్తీక దామోదర పూజలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో రెడ్డిపల్లి సైదులు సైదమ్మ దంపతులు, కొత్త శోభ, మీలా పావని, చేగోని వెంకటమ్మ,గుండు రూప, రాపోలు లక్ష్మి, కొంపెల్లి సుజాత, పబ్బతి రాజ్యలక్ష్మి, కోమటి పారిజాత,వోరుగంటి ఉష, బండారు నాగమ్మ, వాసవి, లక్ష్మీ, అండాలు, స్రవంతి, శోభ, రమ్య, అనూష ఉన్నారు.
