వైభవంగా మండల మహా కలశ స్థాపన
- వైభవంగా మండల మహా కలశ స్థాపన - November 16, 2026
- 41 రోజుల పాటు అయ్యప్ప స్వాములకు అన్నదానం - November 16, 2026
- బొల్లెపల్లి ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ - November 16, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 16: మండల కేంద్రంలోని శ్రీ సాయి మణికంఠ దేవాలయంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల మహాపూజ కార్యక్రమాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మహాగణపతి హోమంతో పూజలకు అంకురార్పణ చేశారు. ఆలయ పూజారి కొటారు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో తాంత్రిక విధానంలో మహాకలశం, అష్టాదశ కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహాకలశాన్ని అయ్యప్ప గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం కలశ జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అయ్యప్ప స్వాముల భజనలు, భక్తుల శరణుఘోషతో ఆలయం మార్మోగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అయ్యప్ప మాలధారణ చేసి దీక్ష స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాజీ ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, అంజమ్మ దంపతులతో పాటు ఆలయ గురుస్వామి పూలస్వామి, అయ్యప్ప మాలదారులు కానుగు లక్ష్మీనారాయణ, పల్స యాదయ్య, నూక సైదులు, కృష్ణమూర్తి, గోగు నాగరాజు, లక్ష్మికాంత్, శివ, నర్సింహ్మ, రమేష్ అయ్యప్ప పాల్గొన్నారు.
