వెల్దండలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం

1001262883.jpg

వెల్దండ:వెల్దండ మండల పరిధిలోని పీవీఆర్ హోటల్ వద్ద రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఘన స్వాగతం పలికారు.హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్న వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామంలోని అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి, గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించి, తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ముస్లిం నాయకుడు ఎండీ రషీద్, కాంగ్రెస్ నాయకులు పసునోజు పురుషోత్తం, కృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...