పోతేపల్లిలో పెన్షన్ల పై స్పెషల్ ఆఫీసర్ తనిఖీ:-

వెల్దండ : వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామంలో చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీ రాంరెడ్డి గారు తనిఖీ నిర్వహించారు. గ్రామంలో దరఖాస్తుదారుల ఇంటి ఇంటికి తిరిగి లబ్ధిదారుల వివరాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీ రాంరెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్ అందాలి. అనర్హులకు ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు – ఇదే ప్రభుత్వ లక్ష్యం .. అని అవినీతి తావు లేకుండా పేదలకు న్యాయం చేస్తామని తేలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తగుళ్ళ కొండల్ యాదవ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మోతిలాల్ నాయక్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు…

You may also like...