కాటన్ మిల్లు కార్మికురాలి ఇంటి నిర్మాణానికి ఉప్పల వెంకటేష్ చేయూత
- నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- మృతురాలి కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం - September 27, 2026
- కాటన్ మిల్లు కార్మికురాలి ఇంటి నిర్మాణానికి ఉప్పల వెంకటేష్ చేయూత - September 27, 2026
కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన కాటన్ మిల్లు కార్మికురాలు నిర్మల ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది.
ఈ విషయాన్ని కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రావు ద్వారా తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మల ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంటును అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘం అధ్యక్షుడు

సూర్యప్రకాష్ రావు, కార్మిక సంఘం నాయకులు వెంకటేష్, వెంకటయ్య, బాలస్వామి, చందు తదితరులు పాల్గొన్నారు.సహాయం అందజేసిన ఉప్పల వెంకటేష్ కు నిర్మల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
