నాగర్ కర్నూల్ లో ఈ నెల 14న ఉచిత కంటి వైద్య శిబిరం

1001248339.jpg

నాగర్‌కర్నూల్: జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న బుధవారం ఉదయం 9 గంటలకు నాగర్‌కర్నూల్‌లోని రాంనగర్ కాలనీ, రామకృష్ణ టాకీస్ రోడ్డులో ఉన్న శోభ ఆప్టికల్స్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు విశ్రాంత నేత్ర వైద్యాధికారి బి. శివారెడ్డి తెలిపారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లకు అర్హులైన వారికి ఎనుగొండలోని లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్, ఓటరు లేదా రేషన్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.

వివరాలకు: 9440454284, 8106333324.

You may also like...