ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేఖ్యతాండ సర్పంచ్కడ్తాల్ లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం
- మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం - August 10, 2026
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆదివారం కడ్తాల్ మండలం రేఖ్య తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాత్లావత్ లక్ష్మిమరియు వార్డు మెంబర్లు,ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వార్డు సభ్యులు లలిత, శ్రీను,ఎస్. విజయ, కృష్ణ లు కాంగ్రెస్ లో చేరారు. ఈసందర్భంగా పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కాండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కృష్ణ, శ్రీను, గంగులు, సోమ్లా, దాస్య, రమేష్, రవి, గణేష్, నరేష్, పాండు, కిరణ్, వాసు, హరి, వినోద్, పవన్, శ్రీధర్, మండల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
