ఉప్పల వెంకటేష్ పిలుపుతో బండోనిపల్లిలో కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు
- ఉప్పల వెంకటేష్ పిలుపుతో బండోనిపల్లిలో కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు - September 7, 2026
- కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదారణ - September 7, 2026
- మృతురాలి కుటుంబానికి భాస్కరరావు ఆర్థిక సహాయం - September 7, 2026
వెల్దండ సెప్టెంబర్ 06:రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల పిలుపుతో బండోనిపల్లిలో ఉప సర్పంచ్ అల్వాల్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 1000 రోజులు అయినా 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బాకీ కార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు.ఉపసర్పంచ్ అల్వాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ..బాకీ కార్డు ఇస్తూ, డోర్ స్టిక్కర్స్ వేస్తూ, బండోనిపల్లి గ్రామంలోని అన్ని వీధులలో ర్యాలీగా పెద్ద ఎత్తున కదిలిన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి,అల్వాల్ రెడ్డి, అల్లాజిగౌడ్, గ్రామ పెద్దలు రామ్ పర్వతాలు యాదవ్, యువకులు కిషోర్, రాజులతో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
