పోతేపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి

వెల్దండ: గుండాల నుంచి పోతేపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు అల్లం తోట బావి తండాలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, వెంటనే కాంట్రాక్టర్‌ను పిలిపించి పనులు చేపట్టాలని సూచించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్, అల్లం తోట బావి తండా సర్పంచ్ సరోజ, అరుణ్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.1001248003.jpg

You may also like...