Daily Archive: November 27, 2026

రాజ్యాంగ విలువలను కాపాడాలి – సర్పంచ్ జంతుక వెంకటయ్య

ఆమనగల్,నవంబర్ 26: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకొని ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామపంచాయతీలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జంతుక వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక విలువలను కల్పిస్తుందని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన…

పరిష్కారం కోసం ఎదురుచూపులు.. పోలీసుల అరెస్టుల మధ్య కొనసాగుతున్న నిరసన

చారకొండ నవంబర్ 26: తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ ఎర్రవల్లి భూ నిర్వాసితులు చేపట్టిన నిరసన దీక్షలు 360వ రోజుకు చేరుకున్నాయి.ఇంతకాలంగా శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం, నిరసన కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు హౌస్ అరెస్టులు…

సీఎం సభకు భారీగా తరలిన వెల్దండ కాంగ్రెస్ శ్రేణులు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,నవంబర్ 26: అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభకు వెల్దండ మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు బస్సులు, ఇతర వాహనాల్లో సభకు బయలుదేరారు.ఈ సందర్భంగా సభకు బయలుదేరిన బస్సులను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వెల్దండ మండల పార్టీ అధ్యక్షులు హరి కిషన్ నాయక్,వెల్దండ సర్పంచ్…

నూతన వధూవరులను ఆశీర్వదించినజహిరాబాద్ఎమ్మెల్యే మాణిక్ రావు

కోహీర్ పట్టణంలో నిర్వహించిన వివాహ వేడుకల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు, పట్టణ అధ్యక్షులు అఖిల్, సంపత్, సందీప్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణలో విద్యార్థులు ముందుండాలి – బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ

తాడ్వాయి: భారతీయ విద్యార్థి మోర్చా (BVM) ఆధ్వర్యంలో తాడ్వాయి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలు, రాజ్యాంగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.కామారెడ్డి జిల్లా సీనియర్ న్యాయవాది సిద్ధిరాములు మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులు, మహిళల రక్షణ చట్టాలు, పోక్సో చట్టంపై వివరించారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో రాణించాలని, తమ హక్కులను తెలుసుకొని…

మూడేళ్లుగా నిలిచిపోయిన గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి!

రామారెడ్డి: రామారెడ్డి నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలోని గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేయించి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గత మూడేళ్లుగా పనులు నిలిచిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నిర్లక్ష్యం వీడి…

అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి – న్యాయవాది రవితేజకు ఘన సత్కారం

తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో అంబేద్కర్ సంఘం మరియు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్మెంట్ పొందిన రవితేజను గ్రామ నాయకులు, ప్రజలు ఆత్మీయంగా ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. న్యాయవాద వృత్తిని కేవలం వృత్తిగా కాకుండా అణగారిన వర్గాలకు న్యాయం అందించే సేవా మార్గంగా భావించాలని సూచించారు.గ్రామం నుంచి…

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత – మాజీ ఉపసర్పంచ్ గైని శివాజీ

సంగోజివాడి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సంగోజివాడి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ గైని శివాజీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య గ్రంథమని అన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి,…

​జడ్పీహెచ్‌ఎస్ దిగ్వాల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

 కోహీర్ మండలం, సంగారెడ్డి జిల్లా  22026: దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి మొహమ్మద్  జాకీర్ హుస్సేన్ హాజరు అయినూరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వం, సామాజిక న్యాయం మరియు విద్యా హక్కు చట్టం గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్…