రిపోర్టర్, కామారెడ్డి | 9491912715
Latest posts by GADDAM RAVI
(see all) తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో అంబేద్కర్ సంఘం మరియు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్మెంట్ పొందిన రవితేజను గ్రామ నాయకులు, ప్రజలు ఆత్మీయంగా ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. న్యాయవాద వృత్తిని కేవలం వృత్తిగా కాకుండా అణగారిన వర్గాలకు న్యాయం అందించే సేవా మార్గంగా భావించాలని సూచించారు.
గ్రామం నుంచి ఎదిగి హైకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందడం గ్రామానికి గర్వకారణమని, భవిష్యత్తులో పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయ సేవలు అందిస్తూ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో నిలబెట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్ని నర్సింలు, రాజాగౌడ్, గంగరాజు, గైని లింగం, సంజీవ్, సాయిలు, రాజు, పోచయ్య, శేఖర్, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్ గౌడ్, రవీందర్, మధుసూదన్ రెడ్డి, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు గడ్డం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, ప్రోత్సాహం తనకు సమాజ సేవలో మరింత బాధ్యతగా ముందుకు సాగేందుకు స్ఫూర్తినిచ్చాయని రవితేజ తెలిపారు.