మూడేళ్లుగా నిలిచిపోయిన గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి!
- రాజ్యాంగ పరిరక్షణలో విద్యార్థులు ముందుండాలి – బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ - November 27, 2026
- మూడేళ్లుగా నిలిచిపోయిన గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి! - November 27, 2026
- అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి – న్యాయవాది రవితేజకు ఘన సత్కారం - November 27, 2026
రామారెడ్డి: రామారెడ్డి నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలోని గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేయించి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గత మూడేళ్లుగా పనులు నిలిచిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
