Daily Archive: November 21, 2026

ప్రజల వద్దకు బ్యాంకింగ్ సేవలు

రెండు రోజుల నుండి వికారాబాద్ జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన ఆఫీసు లో నిర్వహించిన శిక్షణ శిబిరం పూర్తి  అయిన సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సర్టిఫికెట్ తో పాటు డివైస్ లు అందించడం జరిగింది. SERP  తెలంగాణ ద్వారా  స్వయం సహాయక సంఘాల  SHG మహిళలకు మద్దతునిస్తూDAY-NLRM  వన్ జీపీ వన్ బీసీ  చొరవ కింద వికారాబాద్ లోని IDOC, ZS లో TASK సహకారంతో బీసీ సఖి రిఫ్రెష్ &ఎంప్లాయిమెంట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ శిబిరం లో…

ఝరాసంగం: విద్యార్థులకు చట్టాలపై అవగాహన

ఝరాసంగం మండలం మాచునూరులోని కేంద్రీయ విద్యాలయంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి జి. కవితాదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ, సాధారణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాలికల భద్రత, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌, బాల కార్మిక నిషేధ చట్టాలపై వివరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

ఝరాసంగం కస్తూర్బాను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

ఝరాసంగం మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను మండల న్యాయ సేవల కమిటీ చైర్‌పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి బి. కవితాదేవి సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

శ్రీనిధి రుణాలు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలకు తీర్మానం.!

వెల్దండ నవంబర్ 21:చెరుకూరు గ్రామైక్య సహకార సంఘం ఆధ్వర్యంలో చెరుకూరు గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనిధి రుణాల రికవరీ, సీఐఎఫ్, బ్యాంకు లింకేజీ, ప్రొఫైల్, కేవైసీ తదితర అంశాలపై చర్చించారు.శ్రీనిధి రుణాలు తీసుకుని ఇప్పటివరకు చెల్లించని సభ్యులు వెంటనే బకాయిలు చెల్లించాలని సమావేశంలో సూచించారు. రుణాలు చెల్లించని వారిపై రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేలా సంఘంలో తీర్మానం చేశారు.ఈ సమావేశానికి పంచాయతీ కార్యదర్శి, సీసీ రాములు, గ్రామ సంఘం ఓబీలు, ఉపసర్పంచ్…

డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలి.. ఆర్డీవోకు వినతిపత్రం

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,నవంబర్ 20: డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఎర్రవల్లి గ్రామాల ఉనికిని కాపాడాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.పాత గోకారం గ్రామాన్ని యథావిధిగా పునర్నిర్మించాలని, ఆర్ అండ్ ఆర్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు. గత 11 నెలలుగా సుమారు 354 రోజుల నుంచి శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని నిర్వాసితులు…

జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్‌ను కలిసిన కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు

జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్‌ను కలిసిన కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు

వ్యవసాయ వర్సిటీలో 566 అధ్యాపక పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌!

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 566 అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో 48 ప్రొఫెసర్‌, 148 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 370...

తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసు శాఖలో 2,000 హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు సమాచారం. నియామక ప్రక్రియకు సంబంధించిన సన్నాహాలను వేగవంతం చేసే దిశగా పోలీసు శాఖ కసరత్తు చేపట్టింది. పోలీసు శాఖ వార్షిక శిక్షణ క్యాలెండర్‌ రూపకల్పనతో పాటు హోంగార్డు పోస్టుల...