ప్రజల వద్దకు బ్యాంకింగ్ సేవలు

రెండు రోజుల నుండి వికారాబాద్ జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన ఆఫీసు లో నిర్వహించిన శిక్షణ శిబిరం పూర్తి  అయిన సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సర్టిఫికెట్ తో పాటు డివైస్ లు అందించడం జరిగింది. SERP  తెలంగాణ ద్వారా  స్వయం సహాయక సంఘాల  SHG మహిళలకు మద్దతునిస్తూDAY-NLRM  వన్ జీపీ వన్ బీసీ  చొరవ కింద వికారాబాద్ లోని IDOC, ZS లో TASK సహకారంతో బీసీ సఖి రిఫ్రెష్ &ఎంప్లాయిమెంట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ శిబిరం లో బీసీ లకు బ్యాంకింగ్ సేవలు, ఖాతాల నిర్వహణ, మైక్రో ఏటీఎం, నగదు నిర్వహణ,  విత్ డ్రాలు, బ్యాలెన్స్ ఎంక్వై రీ ,AEPS, సైబర్ మోసాలపట్ల జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంక్ అధికారులు ,APM లు, సీసీ లు పాల్గొన్నారు.

You may also like...