రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనగామలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణకు నిర్ణయం
- విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప - November 21, 2026
- జనగామలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి విశేష స్పందన - November 21, 2026
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనగామలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణకు నిర్ణయం - November 21, 2026

జనగామ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బంధారపు యాదగిరి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేష్ మాట్లాడుతూ.. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.బీజేపీ ఆధ్వర్యంలో దశలవారీగా విస్తృత కార్యక్రమాలు చేపట్టి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికార ప్రతినిధి పెద్దోజు జగదీష్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఎల్లయ్య, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జి. రాములు, దుర్గా రాజ శివకుమార్, జిల్లా కోశాధికారి తుడుముల అనిల్, ప్రధాన కార్యదర్శి జనార్ధన్, మహిళా నాయకులు రమాదేవి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
