Daily Archive: November 21, 2026
జ్ఞాన తెలంగాణ డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో...
జ్ఞాన తెలంగాణ, డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ, సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారిస్తూ ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి సందీప్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పర్యటనలో భాగంగా గాంధీభవన్‌లో పీఏసీ, పీసీసీల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సందీప్ పాల్గొని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో పార్టీ...
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా జూపల్లి గ్రామానికి చెందిన అరెకంటి శివప్రసాద్ తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నియమితులయ్యారు. ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వార్డు సభ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, గౌరవం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఫోరం బలోపేతానికి,…
లింగంపేట్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో రైతులను కలిసి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్ సన్న వడ్లను కేవలం…