రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత* — ఈ నెల 26న దౌల్తాబాద్‌లో సామాజిక సదస్సు
- రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత* — ఈ నెల 26న దౌల్తాబాద్‌లో సామాజిక సదస్సు - November 24, 2026
- అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి - November 16, 2026
- హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక* - November 15, 2026
సంగారెడ్డి :- భారత రాజ్యాంగంపై చర్చించి, యువతకు సామాజిక స్ఫూర్తిని అందించాలన్న సంకల్పంతో ఈ నెల 26వ తేదీ (గురువారం) ఉదయం 10:30 గంటలకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ప్రత్యేక సామాజిక సదస్సు నిర్వహిస్తున్నట్లు సామాజిక ఉద్యమ నాయకులు మీనంపల్లి కిషన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. దళిత జర్నలిస్టుల ఫోరమ్ (హత్నూర మండల కమిటీ) ఆధ్వర్యంలో “77 ఏళ్ల భారత రాజ్యాంగం – బహుజనుల స్థితిగతులు” అనే అంశంపై ఈ సదస్సు జరగనుందని, దీనికి ప్రజలందరూ తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
