అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
- అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి - November 16, 2026
- హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక* - November 15, 2026
- విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి - November 14, 2026
సంగారెడ్డి :- అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నివాస స్థలాలు మంజూరు చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) హత్నూర మండల కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హత్నూర తహసీల్దార్ పర్వీన్ షేక్ కి వినతిపత్రం సమర్పించారు. గత కొన్నేళ్లుగా హత్నూర మండలంలో జర్నలిస్టులుగా పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నామని ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం నిరుపేదలుగా గుర్తించి, సంక్షేమ పథకాల నిబంధనల ప్రకారం అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ నివాస స్థలాలు కేటాయించాలని ఎమ్మార్వో ని కోరారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ మండల గౌరవ అధ్యక్షుడు మీనం పల్లి కిషన్ రావు, జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వరిగుంతం శంకర్, మండల అధ్యక్షుడు మద్దెల పోచయ్య, ప్రధాన కార్యదర్శి పరమేషుల కృష్ణ, సంఘం సభ్యలు శ్రీధర్ గల్ల, బేగరి పద్మారావు, పాతూరి నగేష్, మామిడి పల్లి రమేష్ గౌడ్ , బాన్సువాడ శ్రీధర్ గౌడ్, తంగడిపల్లి నవీన్ గౌడ్, కోల విష్ణు, ఉప్పరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
