రిపోర్టర్, నల్గొండ | 7702665844
Latest posts by Gandamalla Kishan
(see all) హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. మంగళవారం కట్టంగూర్‌లోని నాలుగో వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాలుగో వార్డు సభ్యురాలు ఏకుల సుజాత ఎన్నికల్లో గెలిస్తే తన సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారని, అందులో భాగంగా రూ.2 లక్షల సొంత నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతునన్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్, మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ, మాజీ ఉపసర్పంచ్ అంతటి శ్రీను, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, శ్రీరామ సంధ్య, కళ్లెం నాగేశ్వరరావు, పులకరం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
