రిపోర్టర్, నల్గొండ | 7702665844
Latest posts by Gandamalla Kishan
(see all) పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి : అయిటిపాముల సర్పంచ్ సుధాకర్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6 : గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని అయిటిపాముల అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధా న్యాలు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ శారదా రాణి, ఉపసర్పంచ్ గోపగోని లింగమ్మ జానయ్య, వీసీపీసీ ఝాన్సీ, అంగన్వాడీ టీచర్లు ఎల్లమ్మ, విజయలక్ష్మి, కవిత, సునీత, ఆదిలక్ష్మి, గర్భిణులు, బాలింతలు తదితరు లు పాల్గొన్నారు.
