రీ సర్వే పక్కాగా నిర్వహించాలి – అదనపు కలెక్టర్ చెన్నయ్య
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- జూపల్లి లో ఘనంగా దుర్గ భవాని అమ్మవారి ఆగమనం - October 9, 2026
- మృతురాలి కుటుంబానికి సర్పంచ్ పరామర్శ..ఆర్థిక సాయం - October 9, 2026

వెల్దండ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రీ-సర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పైలట్ గ్రామమైన లింగారెడ్డిపల్లిలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును పరిశీలించిన అదనపు కలెక్టర్.. భూ సర్వేలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పూర్తి కచ్చితత్వంతో పనులు చేపట్టాలని సర్వేయర్లకు సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడి రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ, రీ-సర్వే ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.ఈ కార్యక్రమంలో వెల్దండ తహశీల్దార్ బిశ్వ కార్తీక్ కుమార్, గిర్దావర్ శంకర్, ఇద్దరు జీపీఓలు, గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య, పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు మల్లేపాకుల శేఖర్, లక్ష్మణ్, మల్లేపాకుల భాస్కర్, యువకుడు జోగు ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.
