మృతురాలి కుటుంబానికి సర్పంచ్ పరామర్శ..ఆర్థిక సాయం
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- జూపల్లి లో ఘనంగా దుర్గ భవాని అమ్మవారి ఆగమనం - October 9, 2026
- మృతురాలి కుటుంబానికి సర్పంచ్ పరామర్శ..ఆర్థిక సాయం - October 9, 2026

వెల్దండ,అక్టోబర్ 9: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన మొకురాల బాలమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, ఉపసర్పంచ్ రామకృష్ణతో కలిసి శుక్రవారం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. బాలమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు సత్తూరి శేఖర్ గౌడ్, మొకురాల వెంకటయ్య, శ్రీకాంత్, శ్రీశైలం, పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
