కాళోజి జయంతిని జల సాధన దినంగా జరుపుకున్న.. జేఏసీ

వెల్దండ, సెప్టెంబర్ 09: చారగొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ భూ నిర్వాసితుల దీక్షలు 282 రోజులకు చేరాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ పిలుపు మేరకు కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా మంగళవారం వెల్దండ బస్టాండ్ ఆవరణలో జలసాధన దినాన్ని ఘనంగా జరుపుకున్నారు.డిండి ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 12న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చేపట్టనున్న సత్యాగ్రహ దీక్ష కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జంగిలి నిరంజన్, మాజీ ఎంపీటీసీ చలిచీమల నిరంజన్, భూ నిర్వాసితులు ఏకుల ప్రకాశ్, పబ్బు పెద్దయ్య గౌడ్, నేనావత్ నాగయ్య, ఏకుల పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...