ఆమనగల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

1001213518.jpg

ఆమనగల్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని శనివారం ఆమనగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక పోరాట యోధురాలిగా, ధిక్కార స్వరానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ మహిళాలోకానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కలకొండ యాదగిరి మాదిగ, సరికొండ పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

You may also like...