బాలాపూర్ గణనాధునికి వంశీచంద్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

బాలాపూర్ గణనాథుడికి చల్లా వంశీచంద్‌రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

బాలాపూర్: బాలాపూర్ ప్రసిద్ధ గణనాథుడిని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, అశ్లేష రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడంగ్‌పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆహ్వానం మేరకు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.కార్యక్రమంలో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, చిగురింత నర్సింహారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ అజీమ్, బత్తోజు విష్ణువర్ధన్, ఆలయ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.1001195706.jpg

You may also like...