పోతేపల్లిలో పెన్షన్లపై స్పెషల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీ.!
- మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 16, 2026
- కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన - September 15, 2026
- శ్రీరాములు కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక సహాయం - September 15, 2026

వెల్దండ / పోతేపల్లి15: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీ రాంరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.గ్రామంలో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల వివరాలను స్వయంగా పరిశీలించారు. పత్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రాంరెడ్డి గారు మాట్లాడుతూ..
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్ అందాలి, అనర్హులకు ఒక్క రూపాయి కూడా వెళ్లకూడదు – ఇదే మా లక్ష్యం పెన్షన్ల పరిశీలనలో పారదర్శకతే ముఖ్యం, అవినీతికి తావు లేకుండా పేదలకు న్యాయం జరిగేలా చూస్తాంఅని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తగుళ్ళ కొండలు యాదవ్ పంచాయతీ కార్యదర్శి మోతిలాల్ నాయక్,వార్డు సభ్యులు ఎగిరి శెట్టి పద్మ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
