బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేసిన.. బిఆర్ఎస్ నాయకులు

భారతమ్మకు బీఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం

వెల్దండ, అక్టోబర్ 12: గుండెపోటుతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెల్దండకు చెందిన నాగిళ్ల భారతమ్మను బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబానికి ధైర్యం చెబుతూ రూ.5 వేలు, వార్డు సభ్యుడు శేఖర్ రూ.5 వేలు.. మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, నాయకులు కట్ట అనిల్ కుమార్, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.1001256884.jpg

You may also like...