కూకట్‌పల్లిలో బూత్ లెవల్ ఏజెంట్లకు కీలక బాధ్యతలు

కూకట్‌పల్లిలో బూత్ లెవల్ ఏజెంట్లకు కీలక బాధ్యతలు

కూకట్‌పల్లి, కూకట్‌పల్లిలోని శ్రీ హేమ దుర్గాభవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు బీఎల్ఏలకు పోలింగ్ బూతుల వారీగా బాధ్యతలు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ఓటర్ల హక్కుల పరిరక్షణకు ప్రతి ఏజెంట్ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పీసీసీ నియమిత కోఆర్డినేటర్ నర్సిరెడ్డి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అన్ని డివిజన్ల అధ్యక్షులు, మాజీ డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

You may also like...