ఆహార తయారీ విక్రయాలపై కీసర పోలీసుల దాడులు

కీసర,: తిమ్మాయిపల్లి గ్రామ శివారులోని శ్రీ కరణిమాతా నమ్కీన్ చిప్స్, చకోడి, బూందీ కంపెనీలో కీసర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్‌ఐ ఎస్. అనిల్ కుమార్‌కు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీస్ సిబ్బంది, ఇద్దరు పంచ సాక్షులతో కలిసి దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తూ, ప్యాకెట్లపై తయారీ, గడువు తేదీలు ముద్రించకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తక్కువ నాణ్యత ముడిసరుకుతో అధిక లాభాలు పొందుతున్నట్లు విచారణలో వెల్లడైంది. చకోడి, బూందీ, మిక్చర్, రత్లామి సేవ్, బాలాజీ పాపడ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆహార పదార్థాల తేదీలు, నాణ్యత పరిశీలించి కొనుగోలు చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

You may also like...