రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
బీర్కూర్ మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) మోహన్ రెడ్డి ఆయిల్ పామ్, శనగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. శనగ పంటలో మొలక శాతం ఆశాజనకంగా ఉందని, ఆయిల్ పామ్తో పాటు శనగ పంటలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, ఫెర్టిలైజర్లపై పలు సూచనలు చేశారు.
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) చేపట్టాలని సూచించారు. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు పంట నష్టాల ముప్పును తగ్గించుకోవచ్చని వివరించారు. వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ్, ఎంఏవో మహేశ్వరి, ఏఈవో మీనా, ఆయిల్ పామ్ క్లస్టర్ ఆఫీసర్ కృష్ణమూర్తి, సీనియర్ ఆఫీసర్ వనోజ్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.