ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి

WhatsApp Image 2026-11-26 at 18.23.52.jpeg

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP) నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా జనగామ మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూపర్‌వైజర్లు, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు.18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ పెద్ద వివరాలను సేకరించి అర్హులైన కుటుంబాలన్నింటినీ రూ.5 లక్షల జీవిత బీమా పథకంలో 100 శాతం నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. వార్డు స్థాయిలో సిబ్బంది సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. లబ్ధిదారుల ఆధార్, రేషన్ కార్డు, ఫోన్ నంబర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక శిబిరాల్లో దరఖాస్తులను పూర్తి చేయించాలని తెలిపారు. రేషన్ కార్డు e-KYC పెండింగ్ ఉన్నవాటిని వెంటనే పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

You may also like...