గుజ్జ సత్యంకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా తాడ్వాయి ప్రతినిధి,అక్టోబర్ 9:
బీసీల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతూ, విద్యా, వైద్య రంగాల్లో రెండు దశాబ్దాలుగా సామాజిక సేవలందిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ)కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య అడుగుజాడల్లో నడుస్తూ కులగణన, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌ల విడుదల కోసం గుజ్జ సత్యం పోరాడుతున్నారని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయడంతోపాటు సత్యం హోమియోపతి ద్వారా సామాన్యులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. పద్మశాలి సమాజానికి చెందిన ఆయన చేనేత కార్మికుల ఉపాధి భద్రత, వృత్తి పరిరక్షణ, ఆర్థిక సహాయం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. బీసీల సమస్యలపై సమగ్ర అవగాహన, ఉద్యమ అనుభవం ఉన్న గుజ్జ సత్యంకు శాసనమండలిలో అవకాశం కల్పిస్తే వెనుకబడిన వర్గాల గొంతుక మరింత బలంగా వినిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయన సేవలను గుర్తించి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి పేరును సిఫారసు చేయాలని చింతల శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దినేష్, సిరిగద, రాజేందర్, లింగమయ్య, బిట్ల సురేందర్, సంఘ గౌడ్, లెగ్గల రాజు, పెంటయ్య వెంకన్న, ఖలీల్, భూపతి, బట్టు వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.
