సంప్రదాయాల బాటలో.. బతుకమ్మ ఆట

వెంకటాపూర్ అగ్రహారం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఉపాధ్యాయురాలు పావని ఆధ్వర్యంలో విద్యార్థుల సందడి

చట్టం/ ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు పావని ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పావని బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. గ్రామంలోని మహిళామణులు సైతం వేడుకల్లో పాల్గొనడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...