వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య
హైదరాబాద్ :-ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.బీఆర్ఎస్ పార్టీకి రాజీ నామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం మార్చి 31 కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించి నా.. పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఏఐసీసీ నేతలు, కేసీ వేణు గోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం బోర్డు సోమవా రం రాత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే 9 అభ్యర్థుల జాబితాలను విడుదల చేయగా, ఇద్దరు అభ్యర్థులతో 10వ జాబితా ను తాజాగా ప్రకటించింది.మహారాష్ట్రలోని అకోలా నుంచి అభ్యర్థిగా డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్‌ను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటిం చింది.ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు..
