ఎమ్మెల్సీ ఓటుకు 6నే ఆఖరి గడువు
- మైనింగ్ గుంతలో పడి ఇద్దరి మృతి - November 3, 2026
- అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ నోట్ల కలకలం - November 3, 2026
- ఎమ్మెల్సీ ఓటుకు 6నే ఆఖరి గడువు - November 3, 2026

జ్ఞాన తెలంగాణ, స్టేట్ బ్యూరో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే పట్టభద్రులకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కీలక సూచన చేసింది. ఓటరు నమోదుకు నవంబర్ 6వ తేదీనే చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చని, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈనెల 25వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. జాబితాలో పేర్లు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం కల్పించనున్నారు. అందిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టిన అనంతరం డిసెంబర్ 10న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలంటే అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సీఈవో కోరారు. ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పట్టభద్రుడి బాధ్యత అని స్పష్టం చేశారు
