Category: మేడ్చల్-మల్కాజ్‌గిరి

భగవాన్ బిర్సా ముండా ఘనంగా జయంతి వేడుకలు

భగవాన్ బిర్సా ముండా జయంతి, జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను 19వ డివిజన్ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కూరాకుల భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ కూరాకుల మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీల హక్కులు, అటవీ సంపద, స్వయంపాలన కోసం బిర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన త్యాగాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ…

ఫతేనగర్‌లో ఘనంగా ఛట్ పూజ వేడుకలు

ఫతేనగర్ డివిజన్‌లోని శివాలయం సమీపంలో బిహారీ సోదరుల ఆధ్వర్యంలో ఛట్ పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛట్ పూజ ప్రకృతి ఆరాధనకు, సూర్యభగవానుడిపై భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు భారతీయ సమాజానికి ప్రత్యేక గుర్తింపు అని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో…

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ చేయనుంది. వీరిలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది దివ్యాంగులు, 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు ఉన్నారు. అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

సైక్లోథాన్‌లో 2,500 మంది సైక్లిస్టుల సందడి

హైదరాబాద్‌లో ఆదివారం ప్రైమ్ అరేనాలో నిర్వహించిన మూడో ఎడిషన్ హెచ్‌సీఎల్ హైదరాబాద్ సైక్లోథాన్‌లో 2,500 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాయింట్ సీపీ ట్రాఫిక్ సున్‌ప్రీత్ సింగ్ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సైక్లిస్టుల భాగస్వామ్యాన్ని పెంచాలని కమిషనర్ పిలుపునిచ్చారు. నగరంలో ప్రతిరోజూ 10 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై తిరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజా రవాణా, కార్‌పూలింగ్, సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. నవంబర్ 26…

వీకెండ్ స్పెషల్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. వందలాదిగా కేసులు నమోదు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందలాది మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో 233 మంది ద్విచక్ర వాహనదారులు, 11 మంది ఆటో డ్రైవర్లు, 36 మంది కార్ల డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనదారులు ఉన్నారు. బీఏసీ పరీక్షల్లో 232 మందికి 36–200 ఎంజీ, 39 మందికి 201–300 ఎంజీ, 11 మందికి 301–550 ఎంజీ ఆల్కహాల్ స్థాయులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం మత్తులో…

సజ్జనార్‌పై ఆరోపణలు.. సీబీఐ విచారణకు రాజాసింగ్ డిమాండ్

హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కేసులు, పెండింగ్ దర్యాప్తులు, ఆర్థిక లావాదేవీలపై స్వతంత్ర విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బంగారం చోరీ, హమ్వే, ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కర్ణాటకలో సుమారు 100 ఎకరాల భూమి కొనుగోలు ప్రచారంపైనా విచారణ జరిపి, ఆదాయానికి మించి ఆస్తులున్నాయో తేల్చాలని కోరారు. సీబీఐ లేదా న్యాయ…

కమాండోల శిక్షణకు OODA షూట్ హౌస్ ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

రాజేంద్రనగర్‌లోని గ్రేహౌండ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ OODA షూట్ హౌస్ (CQB ఫైరింగ్ రేంజ్)ను ప్రారంభించారు. పోలీసు అమరవీరులు సందీప్, పవన్, శ్రీధర్‌ల స్మారకార్థం ఈ శిక్షణ కేంద్రానికి వారి పేర్లను అనుసంధానించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోల గురి, పోరాట సంసిద్ధత పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఫిబ్రవరి 2 నుంచి రాజస్థాన్‌లో జరిగే అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో నాలుగో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతర కఠోర శిక్షణతో…

చెరువు హద్దులపై హైకోర్టు కీలక ఆదేశాలు

కుత్బుల్లాపూర్, బాచుపల్లి కోమటికుంట చెరువు (లేక్ ఐడీ: 2822) ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ హద్దుల నిర్ధారణకు పది రోజుల్లో భూ రికార్డులు సమర్పించాలని HMDA, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 11-11-2026న C.C.No.1690 of 2026 విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. వాసవి ఇన్‌ఫ్రా 8, 9 బ్లాకుల ఆక్రమణ ఆరోపణలపై పిటిషనర్ ఆకుల సతీష్ దాఖలు చేసిన కేసులో అసలు ప్రభుత్వ రికార్డులతో…

రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలించిన డిసిపి లక్ష్మి

జీరో ఫాటాలిటీ డిస్ట్రిక్ట్ (ZFD) కార్యక్రమంలో భాగంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు, చెర్లపల్లి బస్‌స్టాండ్ జంక్షన్ వద్ద ప్రమాదకర ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. రోడ్ సేఫ్టీ డీసీపీ ఏ. లక్ష్మి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్, ఆర్టీఏ, మున్సిపల్, రోడ్డు భద్రతా విభాగాల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రహదారుల విస్తరణ, ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, జంక్షన్ల అభివృద్ధి, పాదచారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను గుర్తించారు. సంబంధిత శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను…

వివాదాస్పద భూవిక్రయాల మోసం.. వ్యక్తిపై పీడీ యాక్ట్

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూముల విక్రయాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై పంజాల జైహింద్ గౌడ్ (63)పై పోలీసులు 2026 నవంబర్ 13న పీడీ యాక్ట్ ప్రయోగించారు. రాంపల్లిలో వివాదాస్పద భూమిలో అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేసి, హక్కులు సక్రమంగా ఉన్నాయని నమ్మించి ప్లాట్లు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో 2026లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయనను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. భూములు కొనుగోలు…