Category: మేడ్చల్-మల్కాజ్‌గిరి

ఉమాదేవి నగర్ కు రూ.62.60 లక్షల నిధులు మంజూరు

కుత్బుల్లాపూర్: ఉమాదేవి నగర్ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఎనిమిది గల్లీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.60 లక్షలు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.2.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి పింకేష్‌తో చర్చించి నిధుల మంజూరుకు ప్రత్యేక చొరవ తీసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, 277వ మహాదేవపురం డివిజన్ అధ్యక్షుడు సిద్ధనోళ్ల సంజీవరెడ్డికి కాలనీ కమిటీ సభ్యులు షెర్విరాల కృష్ణమూర్తి గుప్త, మహేష్ గౌడ్, కాలనీవాసులు కృతజ్ఞతలు…

డేటింగ్ యాప్‌తో వల.. మత్తుమందు ఇచ్చి దోపిడీలు

మల్కాజిగిరి: గ్రైండర్ డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని, బాధితులకు మత్తు పదార్థాలు కలిపిన బీరు ఇచ్చి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకుంటున్న ఐదుగురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా బాధితుల వివరాలు సేకరించి, ఇళ్లకు వెళ్లి నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం పోలీస్ పరిధుల్లో మొత్తం 14 కేసులతో వీరికి సంబంధాలున్నట్లు గుర్తించారు. ప్రజలు అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని,…

నిరుపేదల వైద్యానికి సీఎం సహాయనిధి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ.2.86 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులను బాచుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు అందజేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో వైద్య చికిత్సల కోసం ఈ ఆర్థిక సాయం మంజూరైంది. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి పండరి రావు, లక్ష్మారెడ్డి, రషీద్, ప్రసన్న కుమార్, డప్పు నరేందర్, మహమ్మద్…

జగద్గిరిగుట్ట హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

జగద్గిరిగుట్టలో 2015లో జరిగిన మెదిది ఆనంద్ కుమార్ (23) హత్య కేసులో నిందితులు నితాయ్ రాకేష్, షేక్ బాబర్ జానీలకు కూకట్‌పల్లి III అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. వెంకటేశ్వరరావు జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధించారు. ఈ కేసులో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కుశాల్కర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.వి.కె. రామకృష్ణ, డి. ఉపేందర్ కీలకంగా వ్యవహరించారు. ఈ వివరాలను సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) ఆఫీస్ ప్రెస్‌నోట్ ద్వారా…

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి – ఏఐటీయూసీ డిమాండ్

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు డీఆర్ఓ మాలతికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ సభ్యుడు డీజీ నరేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఏడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో పాఠశాల నిర్మాణానికి 2.39 ఎకరాల స్థలం కేటాయించడంపై సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం కేపీహెచ్‌బీ రమ్య గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో పాఠశాల నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో గాలి బాలాజీ, రాజేష్, శంకర్ గౌడ్, కొప్పిశెట్టి దినేష్ కుమార్, రంగమోహన్,…

దస్తావేజు కార్యాలయం ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు వజ్రేస్ యాదవ్

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మేడ్చల్ డివిజన్ దస్తావేజుల కార్యాలయాన్ని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న రిజిస్ట్రేషన్ సేవలను పరిశీలించారు. ప్రజలకు సమీపంలోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. కొత్త కార్యాలయం ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్ సంబంధిత పనులు మరింత సులభతరం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో…

జేఎన్‌టీయూలో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పరిధిలో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్సిటీ హాస్టల్ భవనం పైనుంచి దూకి 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో...

అత్వెల్లి ఛత్ పూజ మహోత్సవంలో.. ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ మండలం అత్వెల్లి చెరువు వద్ద జన సేవ సంఘ్ ఛత్ పూజ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్ పూజ మహోత్సవంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యభగవానుడు, ఛటీ మైయాకు భక్తులు కృతజ్ఞతలు తెలిపే ఈ ప్రాచీన పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసే ఇటువంటి వేడుకలు సామాజిక సమైక్యతను పెంపొందిస్తాయని…

శెట్టిబలిజ వనభోజన మహోత్సవంలో.. కూన శ్రీశైలం గౌడ్

షాపూర్‌నగర్‌లోని హెచ్‌ఎంటీ కాలనీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని హరిహర కళాభవన్‌లో కుత్బుల్లాపూర్ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, ప్రేమాభిమానాలు, సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తన సహకారం ఎల్లప్పుడూ…