భగవాన్ బిర్సా ముండా జయంతి, జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను 19వ డివిజన్ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కూరాకుల భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ కూరాకుల మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీల హక్కులు, అటవీ సంపద, స్వయంపాలన కోసం బిర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన త్యాగాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు కిషోర్, ఉదయ్, మల్లేష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.