Category: మేడ్చల్-మల్కాజ్‌గిరి
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 21 తులాల బంగారం, 15 గ్రాముల వజ్రాలు, 54 తులాల వెండి ఆభరణాలు, రూ.9 లక్షల నగదు కలిపి సుమారు రూ.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సచివాలయ నగర్‌లో దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఐదు సెల్‌ఫోన్లు, బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయి కిషన్ (44)పై కత్తులతో దాడి చేసిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో కార్యాలయంలో ఉన్న కిషన్‌పై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. పాత విభేదాలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో రూ.10 లక్షల సుపారీ ఇచ్చి హత్యకు…
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జలకన్య హోటల్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం సదర్ సమ్మేళన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్‌లతో కలిసి మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ 291వ డివిజన్ కళావతి నగర్‌లో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. బస్తీలోని స్మశాన వాటిక పక్క నుంచి కమిటీ హాల్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే బొందలగడ్డ అభివృద్ధికి రూ.150 లక్షలు, పాఠశాల సమీప రోడ్లకు రూ.42.50 లక్షలు కేటాయించడంతో పాటు స్మశాన వాటిక పునర్నిర్మాణం, మహిళా భవన్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని…
హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. డివిజన్‌లో ప్రజల సమస్యలకు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో హైదర్‌నగర్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ వర్క్ ఇన్‌స్పెక్టర్…
షాపూర్ నగర్: అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం షాపూర్ నగర్‌లోని తన నివాసంలో ఏడుగురు బాధిత కుటుంబాలకు మొత్తం రూ.4.20 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్…
మూసాపేట్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ సలీం తన మిత్రబృందంతో కలిసి జనతానగర్ బస్తీలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. చిన్నారుల చిరునవ్వులే రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకాలని సలీం పేర్కొన్నారు. బాలల హక్కులు, సంతోషం, ఆరోగ్యకరమైన బాల్యం సమాజ బాధ్యతని ఈ సందర్భంగా తెలిపారు. చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పిలుపు మేరకు గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హన్మంత్ రెడ్డి ప్రారంభించగా, 200 మందికి పైగా గిగ్ వర్కర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించి, మెరుగైన పని పరిస్థితులు, భద్రత, సంక్షేమం కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.
మేడ్చల్ : కీసర పోలీస్‌స్టేషన్‌లో ఉన్నతాధికారులు భారీ స్థాయిలో శాఖాపరమైన మార్పులు చేపట్టారు. ఎస్‌ఐ నాగరాజుతో పాటు మరో 10 మంది కానిస్టేబుళ్లను సౌత్‌జోన్‌కు బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పోలీస్‌స్టేషన్‌లో వరుసగా అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు వెలుగులోకి...
ప్రత్యేక కథనం: మహిళల భద్రతపై ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. మహిళలను వేధించడం, వెంటపడటం, ఫోన్ కాల్స్‌తో విసిగించడం, సోషల్ మీడియా వేదికగా అసభ్య సందేశాలు పంపడం, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడటం...